మేషం
ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. సన్నిహితుల నుండి వివాదాలకు సంబంధించిన సమాచారం అందుతుంది. వృత్తి ఉద్యోగ అధికారులతో చర్చలు సఫలమౌతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ప్రయాణ లాభాలున్నవి చేపట్టిన పనులలో జాప్యం కలిగినప్పటికి నిదానంగా పూర్తి చేస్తారు.
వృషభం
సంతాన ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలి. గృహమున విలువైన వస్తువుల విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. ఊహించని విధంగా ఇతరులతో విరోధాలు కలుగుతాయి వృత్తి ఉద్యోగాలలో పని ఒత్తిడి పెరుగుతుంది. కుటుంబ సభ్యులు మీ మాటతో విభేదిస్తారు.
మిధునం
వృత్తి వ్యాపారాలలొ మిశ్రమ ఫలితాలుంటాయి. శారీరక మానసిక అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. పాత రుణాలు తీర్చగలుగుతారు. ఉద్యోగస్తులు వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. మాతృ వర్గం వారితో మాటపట్టింపులు ఉంటాయి. చేపట్టిన పనులలో అడ్డంకులు తప్పవు.
కర్కాటకం
నిరుద్యోగులకు నూతన అవకాశాలు అందుతాయి. నూతన వస్త్ర ఆభరణాలను కొనుగోలు చేస్తారు అన్ని వైపుల నుండి ఆర్థిక లాభాలు అందుతాయి. వృత్తి వ్యాపారాలు ఆశించిన విధంగా సాగుతాయి. సోదరులతో సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి. కీలక వ్యవహారాలలో ధైర్యసాహసాలతో నిర్ణయాలు తీసుకుంటారు.
సింహం
వృత్తి వ్యాపారాలలో ఆలోచనలు అంతగా కలసిరావు. ప్రారంభించిన పనులు మందగిస్తాయి. ఇంటా బయట ఊహించని సమస్యలు కలుగుతాయి. ధన పరమైన విషయాలలో ఇతరులకు మాట ఇవ్వడం మంచిది కాదు. కుటుంబ సభ్యులతో మనస్పర్ధలు తప్పవు. ఆదాయానికి మించి ఖర్చులుంటాయి.
కన్య
ఉద్యోగమున అధికారులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త వ్యవహారించాలి. ఆదాయం పెరుగుతుంది. ఇంటాబయటా సమస్యలు ఉన్నప్పటికీ నిదానంగా పరిష్కరించుకుంటారు. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు వేగవంతం చేస్తారు వృత్తి వ్యాపారాలలో నష్టాలు అధిగమించి లాభాలు అందుకుంటారు.
తుల
నిరుద్యోగ ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి. కొన్ని వ్యవహారాలలో ఊహించని ఇబ్బందులు ఎదురవుతాయి. వృత్తి ఉద్యోగాలలో అధికారులతో నిదానంగా వ్యవహరించాలి. వ్యాపారాల్లో ఆశించిన రీతిలో లాభించవు. దూర ప్రయాణ సూచనలున్నవి. అనుకోని విధంగా ఖర్చులు పెరుగుతాయి.
వృశ్చికం
ఇతరుల సహాయ సహకారాలతో కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. దీర్ఘకాలిక రుణాలు తీర్చగలుగుతారు. శారీరక మానసిక ప్రశాంతత లభిస్తుంది. సంతానానికి నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో అదనపు బాధ్యతల నుండి ఉపశమనం పొందుతారు. వ్యాపారాలు విస్తరణకు శ్రీకారం చుడతారు.
ధనస్సు
దాయాదులతో స్ధిరాస్తి వివాదాల పరిష్కార దిశగా సాగుతాయి. నిరుద్యోగులకు లభించిన అవకాశాలను జార విడువకుండా చూసుకోవాలి. ఇంటా బయట గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఉద్యోగస్తులు ఉన్నత పదవులు పొందుతారు. కొన్ని వ్యవహారాలలో ఆత్మవిశ్వాసంతో స్థిర నిర్ణయాలు చేసి లాభపడతారు.
మకరం
సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి వృత్తి వ్యాపారాలలో ఆశించిన లాభాలు అందుకుంటారు. సంతాన వివాహ ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్థికంగా అనుకూల వాతావరణం ఉంటుంది. తల్లి తండ్రుల ఆరోగ్యం విషయంలో శుభ వార్తలు అందుతాయి. గృహనిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి.
కుంభం
శారీరక మానసిక అనారోగ్య సమస్యలు మరింత బాధిస్తాయి. అనుకున్న సమయానికి అనుకున్న రీతిలో సౌకర్యాలు లభించక ఇబ్బంది పడతారు. వృత్తి ఉద్యోగాలలో నిలకడ లోపిస్తుంది. దూరప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. ధన వ్యవహారాలలో ఇతరులకు మాట ఇచ్చి ఇబ్బందులు ఎదుర్కొంటారు.
మీనం
వృత్తి ఉద్యోగాలలో సహోద్యోగులతో సఖ్యతగా వ్యవహరించి ప్రశంసలు అందుకుంటారు. జీవిత భాగస్వామి బంధువుల నుండి శుభవార్తలు అందుతాయి. ఇంటా బయటా మీ మాటకు విలువ పెరుగుతుంది. బంధుమిత్రుల సమాగమం ఆనందం కలిగిస్తుంది. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. చేపట్టిన పనులు అప్రయత్నంగా పూర్తవుతాయి.