చిత్తూరు నగరంలోని అంకాల పరమేశ్వరి ఆలయంలో దీపావళి అమావాస్య సందర్భంగా మంగళవారం అమ్మవారికి విశేష ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు. దూపదీప నైవేద్యాలు సమర్పించారు. వివిధ రకాల పుష్పాలతో అమ్మవారిని అలంకరించి హారతులు పట్టారు. అనంతరం పుర వీధుల్లో గ్రామోత్సవం నిర్వహించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. కార్యక్రమంలో ఆలయ అర్చకులు కుమార్ పాల్గొన్నారు.