నాగుల చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని సత్యవేడు నియోజకవర్గం పిచ్చాటూరు టీచర్స్ కాలనీలోని నాగాలమ్మ దేవాలయంలో శుక్రవారం విశేష అలంకరణ చేశారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని పాలు, కోడిగుడ్లు నాగదేవతకు నైవేద్యంగా సమర్పించి భక్తిశ్రద్ధలతో కొలిచారు. ఉదయం నుంచి ఆలయం భక్తులతో సందడిగా మారింది.