మేషం
స్ధిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. వృత్తి వ్యాపారాల్లో ఆశించిన ఫలితాలు పొందుతారు. ఉద్యోగమున కీలక నిర్ణయాలు తీసుకుంటారు. సమాజమున ప్రముఖులతో పరిచయాలు విసతృతమౌతాయి. అవసరానికి కుటుంబ సభ్యుల నుండి ధన సహాయం అందుతుంది.
వృషభం
వృధా ప్రయాణాలు చెయ్యవలసిన వస్తుంది. వృత్తి వ్యాపారాలలో తొందరపాటు నిర్ణయాలు చేయటం మంచిది కాదు. ఇంటా బయట వివాదాలు కొంత చికాకు కలిగిస్తాయి. చేపట్టిన పనులు శ్రమాధిక్యతతోకానీ పూర్తి కావు. ఆర్థికంగా కొంత ఒడిదుడుకులు తప్పవు. ఉద్యోగస్తులకు శ్రమ అధికమవుతుంది.
మిధునం
బంధుమిత్రులతో చిన్నపాటి వివాదాలు ఉంటాయి. నూతన వ్యాపారాలు ప్రారంభానికి అలోచించి నిర్ణయాలు చెయ్యాలి. ఋణ ఒత్తిడి పెరుగుతుంది. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలు చెయ్యడం మంచిది కాదు. ఉద్యోగ వాతావరణం గందరగోళంగా ఉంటుంది.
కర్కాటకం
సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. చిన్ననాటి మిత్రుల నుండి విలువైన వస్తువులు బహుమతులుగా పొందుతారు. విద్యార్థుల కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది. ఆత్మవిశ్వాసంతో పనులు పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారాల్లో ఆశించిన పురోగతి సాధిస్తారు.
సింహం
కుటుంబ సభ్యులతో విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి ఉద్యోగాలలో నూతన హోదాలు పొందుతారు. ఆర్థిక పరిస్థితులు అనుకూలిస్తాయి. చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. నూతన వ్యక్తుల పరిచయాలు ఉత్సాహనిస్తాయి. చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది.
కన్య
చేపట్టిన పనులు సకాలంలో పూర్తి కాక చికాకు పరుస్తాయి. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు వాయిదా పడుతాయి. కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు ఉంటాయి. ధన పరంగా ఇబ్బందులు తప్పవు. దూర ప్రయాణాలలొ వాహన ఇబ్బందులు కలుగుతాయి.
తుల
దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి వ్యాపారాలలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఇంటా బయట ఊహించని సమస్యలు ఎదురవుతాయి. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చెయ్యడం మంచిది కాదు. మిత్రుల నుండి కీలక సమాచారం అందుతుంది. ఉద్యోగ విషయమై అధికారుల నుండి విమర్శలు తప్పవు.
వృశ్చికం
విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. కుటుంబ సభ్యులతో దైవదర్శనం చేసుకుంటారు. వ్యాపార ఉద్యోగాలలో మరింత ఉత్సాహంగా పని చేసే లాభాలు అందుకుంటారు. చాలా కాలంగా వేధిస్తున్న సమస్యల నుండి బయటపడతారు. ఆప్తుల నుండి శుభవార్తలు అందుతాయి. గృహమున శుభాకార్య విషయమై ప్రస్తావన వస్తుంది.
ధనస్సు
ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. వృత్తి వ్యాపారాలలొ గందరగోళ పరిస్థితులు ఉంటాయి. ఉద్యోగస్థులకు అదనపు పని భారం వలన తగిన విశ్రాంతి లభించదు. జీవిత భాగస్వామితో అకారణ వివాదాలు కలుగుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. చేపట్టిన పనులలో ప్రతిబంధకాలు తప్పవు.
మకరం
చేపట్టిన వ్యవహారాలలో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. వృత్తి ఉద్యోగాలు అనుకూలంగా సాగుతాయి. నిరుద్యోగులకు అరుదైన అవకాశాలు లభిస్తాయి. ఆర్థిక పురోగతి కలుగుతుంది. సన్నిహితులతో గృహమున సంతోషంగా గడుపుతారు. వ్యాపార విస్తరణకు మిత్రుల సహాయం అందుతుంది.
కుంభం
పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వృత్తి వ్యాపారాలలో ఊహించని మార్పులు చోటు చేసుకుంటాయి. నూతన ఋణ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆకస్మిక ప్రయాణాలు చేయవలసి వస్తుంది. కుటుంబ సభ్యులు మీ మాటతో విబేదిస్తారు. ఉద్యోగమున సహోద్యోగులతో వివాదాలు పరిష్కారమౌతాయి.
మీనం
నిరుద్యోగులకు నూతన అవకాశములు అందుతాయి. భూ సంభందిత క్రయ విక్రయాలలో లాభాలు అందుకుంటారు. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగ్గా ఉంటుంది. విలువైన వస్తులాభాలు అందుకుంటారు. గృహమున శుభాకార్యములు నిర్వహిస్తారు.