మేషం
వృత్తి, వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. సన్నిహితుల నుంచి ఊహించని సమస్యలు కలుగుతాయి. ఆర్థిక పరిస్థితి కొంత నిరుత్సాహ పరుస్తుంది. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ఉద్యోగమున చికాకులు తప్పవు. చేపట్టిన పనులలో శ్రమాధిక్యత తప్పదు.
వృషభం
సంఘంలో విశేషమైన గౌరవ మర్యాదలు పొందుతారు. ఆకస్మిక ధన లాభసూచనలున్నవి, సోదరులతో స్థిరస్థి వివాదాలు ఒక కొలిక్కి వస్తాయి. వ్యాపార, ఉద్యోగాలలో ఆశించిన పురోగతి పొందుతారు. ప్రముఖులతో పరిచయాలు విస్తృతమౌతాయి. నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు.
మిధునం
కుటుంబ బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చూడతారు. వృత్తి ఉద్యోగాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. మిత్రులతో విందువినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు. అవసరానికి ఇతరులకు ధన సహాయం అందుతుంది. వ్యాపార, ఉద్యోగాలు లాభసాటిగా సాగుతాయి.
కర్కాటకం
కీలక వ్యవహారాలలో తొందరపాటు నిర్ణయాలు తీసుకొని ఇబ్బందికి గురి అవుతారు. దూరప్రయాణాలలో జాగ్రత్త వహించాలి. ముఖ్యమైన వ్యవహారాలు వాయిదా వెయ్యడం మంచిది. వృత్తి, వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. కుటుంబ సభ్యులతో దైవదర్శనాలు చేసుకుంటారు. ఆర్థిక విషయాలు నిరాశ కలిగిస్తాయి.
సింహం
రుణగ్రస్థుల నుండి రావలసిన సొమ్ము సకాలంలో చేతికందుతుంది. ముఖ్యమైన పనులు వాయిదా వెయ్యడం మంచిది. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు. ఉద్యోగాలు అంతంత మాత్రంగా సాగుతాయి. దూరప్రయాణ సూచనలు ఉన్నవి. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి.
కన్య
సంతాన విద్యా విషయాలలో శుభవార్తలు అందుతాయి. సన్నిహితులతో గృహమున ఆనందంగా గడుపుతారు. నూతన వస్తు వాహన లాభాలు పొందుతారు. నిరుద్యోగుల యత్నాలు సానుకూలమవుతాయి. సమాజంలో విశేషమైన గౌరవ మర్యాదలు పొందుతారు. ఉద్యోగ వాతావరణం అనుకూలిస్తుంది.
తుల
ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా సాగుతాయి. రాజకీయ ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. చిన్న నాటి మిత్రుల నుండి కీలక విషయాలు సేకరిస్తారు. నూతన వ్యాపారాలు ప్రారంబించి లాభాలు అందుకుంటారు. వృత్తి ఉద్యోగాలలో మీ ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి.
వృశ్చికం
ఇంటాబయట పరిస్థితుల్లు చికాకు పరుస్తాయి గృహ నిర్మాణ పనులు మందగిస్తాయి. ఆదాయానికి మించి ఖర్చులుంటాయి. కుటుంబ సభ్యులతో ఆలయాలు సందర్శిస్తారు. ఉద్యోగ వాతావరణం కొంత ఇబ్బంది కలిగిస్తుంది. వ్యాపారమున నూతన సమస్యలు కలుగుతాయి.
ధనస్సు
ఆర్థిక సమస్యలు పెరిగి నూతన రుణాలు చేస్తారు. చేపట్టిన పనులలో జాప్యం కలుగుతుంది. వృత్తి, వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. సంతాన విద్యా ఉద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి. బందు మిత్రులతో వివాదాలు కలుగుతాయి. చేపట్టిన పనులలో శ్రమాధిక్యం తప్పదు.
మకరం
చిన్న నాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాలు నిర్వహిస్తారు. నిరుద్యోగులకు నూతన ఉద్యోగయోగం ఉన్నది. కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు. వృత్తి, వ్యాపారాలు మరింత లాభసాటిగా సాగుతాయి. ప్రయాణాలలో కొత్త వ్యక్తుల పరిచయాలు కలుగుతాయి.
కుంభం
దైవదర్శనాలు చేసుకుంటారు. వృధా ప్రయాణాలు చెయ్యవలసి వస్తుంది. దీర్ఘకాలిక ఋణ భారం పెరుగుతుంది. సంతాన అనారోగ్యం విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. సోదరులతో స్వల్ప వివాదాలు ఉంటాయి. ఇంటా బయట ఊహించని సమస్యలు కలుగుతాయి. వృత్తి, వ్యాపారాలు అంతగా అనుకూలించవు.
మీనం
ఆప్తులతో శుభాకార్యాలలో పాల్గొంటారు. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. ప్రయాణాలలో నూతన మిత్రుల పరిచయాలు కలుగుతాయి. ఆకస్మిక ధనలాభ సూచనలున్నవి. విద్యార్థులు పోటీ పరీక్షలలో అనుకూల ఫలితాలు సాధిస్తారు. దైవ చింతన పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు స్వల్ప లాభాలు అందుకుంటారు.