ఆముదాలవలస మండలంలోని గాజుల కొల్లివలస సమీపంలో ఉన్న సంగమేశ్వర ఆలయ ఆవరణలో ఇసుకతో తయారుచేసిన శివలింగం భక్తులను ఆకర్షిస్తుంది. కార్తీక సోమవారం సందర్భంగా సైకిత శిల్పి గేదెల హరికృష్ణ ఓం నమశ్శివాయ అంటూ శివలింగం సైకితంతో తయారు చేశారు. ఇది కొండకు వచ్చే భక్తులను విశేషంగా ఆకర్షిస్తుంది. గతంలో పలు సందర్భాల్లో హరికృష్ణ తన కళానైపుణ్యతను ప్రదర్శిస్తూ పలువురు మన్ననలు పొందారు.