మేషం
సంతాన ఉద్యోగ ప్రయత్నాలు నిరుత్సాహపరుస్తాయి. చేపట్టిన పనులు అతి కష్టం మీద పూర్తవుతాయి. ఉద్యోగాలలో అధికారుల నుండి వ్యతిరేకత పెరుగుతుంది. ప్రయాణాలు వాయిదా పడతాయి. స్ధిరాస్తి వ్యవహారాలలో పెద్దలతో ఆలోచించి మాట్లాడాలి. వృత్తి వ్యాపారాలు మిశ్రమంగా సాగుతాయి.
వృషభం
వృత్తి, ఉద్యోగపరంగా అనుకూల వాతావరణం ఉంటుంది. ముఖ్యమైన వ్యవహారాలలో సోదరుల సహాయంతో ముందుకు సాగుతారు. దైవ కార్యక్రమాలు నిర్వహిస్తారు. అవసరానికి రావలసిన సోమ్ము అందుతుంది. స్థిరస్తి వివాదాలు పరిష్కారమౌతాయి. గృహ వాతావరణం సంతోషకరంగా ఉంటుంది.
మిధునం
ఆర్థికంగా మరింత ఇబ్బందికర వాతావరణం ఉంటుంది. నిరుద్యోగులకు లభించిన అవకాశములు సద్వినియోగం చేసుకోవడంలో విఫలమౌతారు. నేత్ర సంభందిత అనారోగ్య సమస్యలు బాధిస్తాయి చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. వృత్తి వ్యాపారాలలో స్వల్ప లాభాలు అందుతాయి.
కర్కాటకం
ధన సంబంధిత విషయాలు సంతృప్తికరంగా సాగుతాయి. వ్యాపారాలలో నూతన పెట్టుబడులు
అందుతాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. అనుకున్న పనులలో జాప్యం కలిగిన నిదానంగా పూర్తిచేస్తారు వృత్తి ఉద్యోగాలలొ హోదాలు పెరుగుతాయి ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది.
సింహం
ఇతరులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. ఉదర సంబంధ అనారోగ్య సమస్యలు భాదిస్తాయి. వ్యాపారాలలో నూతన సమస్యలు చికాకు పరుస్తాయి. ఆదాయానికి మించి ఖర్చు పెరుగుతుంది. ఋణదాతల నుండి ఒత్తిడి పెరుగుతుంది.
కన్య
ఆర్థిక పరంగా అనుకూల వాతావరణం ఉంటుంది. గృహమున శుభకార్య విషయంపై ప్రస్తావన
వస్తుంది. సంఘంలో ప్రముఖుల నుండి విశేషమైన ఆదరణ లభిస్తుంది. ఉద్యోగమున అదనపు బాధ్యతల నుండి ఉపశమనం పొందుతారు. సంతాన ఉద్యోగ వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. బంధు మిత్రుల సహాయంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు.
తుల
వృత్తి వ్యాపారాలలో స్వంత ఆలోచనలతో చెయ్యడం మంచిది. కష్టపడిన శ్రమకు తగిన ఫలితం ఉండదు. బంధువులలో చిన్నపాటి వివాదాలు ఉంటాయి. ఉద్యోగమున సమస్యలు పరిష్కార దిశగా సాగుతాయి. వ్యాపార వ్యవహారాలు ఆశాజనకంగా సాగుతాయి. ఇంటా బయట అనుకూల వాతావరణం ఉంటుంది.
వృశ్చికం
వృత్తి వ్యాపారాలు మందగిస్తాయి. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలి. ఉద్యోగ ప్రయత్నాలు నిరుత్సాహపరుస్తాయి. కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు కలుగుతాయి చేపట్టిన పనులు మధ్యలో నిలిచిపోతాయి. ఇతరుల ప్రవర్తన వలన మానసిక అశాంతి కలుగుతుంది.
ధనస్సు
సంతాన వ్యవహారాలు సమస్యాత్మకంగా సాగుతాయి. వృత్తి వ్యాపారాలలో గందరగోళ
పరిస్థితులుంటాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు విసుగు కలిగిస్తాయి. విలువైన వస్తువుల విషయంలో జాగ్రత్త అవసరం. దూర ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. విద్యార్దులు మరింత కష్టపడవలసి వస్తుంది.
మకరం
ప్రయాణాలలో నూతన పరిచయాలు కలుగుతాయి. ప్రభుత్వ అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. ముఖ్యమైన వ్యవహారాలలో జీవిత భాగస్వామి సలహా తీసుకోవడం ముందుకు సాగడం మంచిది. సంతాన విద్యా విషయాలు సానుకూల ఫలితాలు ఇస్తాయి ఉద్యోగమున ఉన్నత పదవులు పొందుతారు.
కుంభం
ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుకుంటారు. ధన పరమైన ఆలోచనలు అనుకూలిస్తాయి. వృత్తి వ్యాపారాలలో శత్రు సమస్యలు నుండి తెలివిగా బయటపడతారు. ఇంటా బయట అనుకూల వాతావరణం ఉంటుంది. కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలు దర్శించుకుంటారు బంధు మిత్రులతో సఖ్యత కలుగుతుంది.
మీనం
దూరప్రాంతాల బందువుల నుండి శుభవార్తలు అందుతాయి. సంతానం విద్యా ఉద్యోగ విషయంలో శుభ వార్తలు అందుతాయి. ఉద్యోగమున అధికారుల నుండి ప్రశంసలు పొందుతారు. మంచి ఆలోచన జ్ఞానంతో ముందుకు సాగుతారు. నూతన వస్తు వాహనం కొనుగోలు చేస్తారు వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి.