విద్యార్థులకు స్కాలర్షిప్స్, ఫెలోషిప్స్ చెల్లించేందుకు ఓ కొత్త పోర్టల్ ను యూజీసీ తీసుకొచ్చింది. పేమెంట్స్ కోసం కెనరా బ్యాంకుతో కలిసి పోర్టల్ సిద్ధం చేయించింది. ఇది పబ్లిక్ ఫైనాన్షియల్ మేనెజ్మెంట్ సిస్టంతో ఇంటిగ్రేడ్ అయి ఉంటుందని అధికారులు తెలిపారు. దీని ద్వారా స్కాలర్షిప్స్, ఫెలోషిప్స్ కెనరా బ్యాంక్ పంపిణీ చేస్తుంది. దీనికి సంబంధించి ఈ నెల 18 వరకూ సంబంధిత అధికారులకు వర్క్ షాప్ నిర్వహించనుంది.