2023 జేఈఈ మెయిన్, అడ్వాన్స్ డ్ పరీక్షలకు ఇంటర్ లో కటాఫ్ ఉండాలనే పాత నిబంధనను మళ్లీ అమలు చేయాలని ఎన్ టీఏ భావిస్తున్నట్లు సమచారం. దీని ప్రకారం జేఈఈ ర్యాంకుతో పాటు ఇంటర్ లో 75 శాతం ఉత్తీర్ణత ఉండాలి. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ఈ కటాఫ్ 65 శాతంగా ఉంది. కరోనా కారణంగా 2020 నుంచి ఈ కనీస మార్కుల నిబంధనను రద్దు చేశారు. పాసైన వారు ప్రవేశ పరీక్ష ర్యాంకుతోనే ఎన్ఐటీలు, ఐఐటీల్లో ప్రవేశాలు పొందే వెసులుబాటు కల్పించారు. ప్రస్తుతం సాధారణ పరిస్థితులు నెలకొనడంతో వచ్చే ఏడాది నుంచి పాత నిబంధన అమలు చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.