పదవ తరగతి విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. టెన్త్ పరీక్షల ఫీజు గడువును ఈ మెల 20 తేదీ వరకు పొడిగించింది. ఈ మేరకు ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకుడు దేవానందరెడ్డి ప్రకటన చేశారు. రూ. 50 అపరాద రుసుముతో ఈ నెల 26 వరకు, రూ. 200 ఫైన్ తో జనవరి 2 వరకు, రూ. 500 ఫైన్ తో జనవరి 9వ తేదీ వరకు ఫీజు చెల్లించుకునే అవకాశం కల్పించారు. కాగా, మార్చి/ఏప్రిల్ నెలల్లో పదవ తరగతి వార్షిక పరీక్షలు నిర్వహించనున్నారు.