డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ పరీక్ష ఫీజు గడవును పెంచినట్లు రీజినల్ కో ఆర్డినేటర్ రజిత ఒక ప్రకటనలో తెలిపారు. యూజీ 1, 3, 4 సెమిస్టర్ పరీక్షలకు ఈ నెల 25 కు ఎలాంటి అపరాధ రుసుము లేకుండా పరీక్ష ఫీజు చెల్లించాలన్నారు. సెన్స్ గ్రూపు సెమిస్టర్ ప్రాక్టికల్ ఈ నెల 24 నుంచి ఉంటుందన్నారు. 70 శాతం హాజరు లేకుంటే ప్రాక్టికల్ కు అనుమతి లేదన్నారు.