ఏపీలోని టెన్త్ విద్యార్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. వార్షిక పరీక్షల ఫీజు చెల్లించని వారికి మరో అవకాశం కల్పించింది. తత్కాల్ స్కీమ్ కింద రూ.500 అపరాధ రుసుముతో జనవరి 26 లోపు ఫీజు చెల్లించుకోవాలని, రూ.1000తో జనవరి 31 వరకు చెల్లించవచ్చని తెలిపింది. ఇదే ఆఖరి అవకాశం అని, మళ్లీ పొడిగించే అవకాశాలు లేవని, ఫీజు చెల్లించకుంటే పరీక్షలు రాసే అవకాశం ఉండదని తెలిపింది.