ఇంటెలిజెన్స్ బ్యూరోలో ఖాళీల భర్తీకి ప్రకటన వెలువడింది. సెక్యూరిటీ అసిస్టెంట్, ఎగ్జిక్యూటివ్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (MTS) 1671 పోస్టులు ఉన్నాయి. ఆన్లైన్ దరఖాస్తుకు తుదిగడువుగా 17 ఫిబ్రవరి 2023ను నియమించారు. దరఖాస్తు ప్రక్రియ 28 జనవరి 2023 నుండి ప్రారంభమైంది. ఈ పోస్ట్‌ల కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు పదవ తరగతి పాస్ అయి ఉండాలి.
ఎగ్జిక్యూటివ్, సెక్యూరిటీ అసిస్టెంట్ పోస్టులకు గరిష్ట వయసు 27 సంవత్సరాలు ఉండాలి. అదే సమయంలో MTS పోస్టులకు గరిష్ట వయోపరిమితిని 25 సంవత్సరాలుగా నిర్ణయించారు. రిజర్వేషన్ వర్తించే అభ్యర్థులకు వయోపరిమితిలో మినహాయింపు అందించారు. వీరికి లెవెల్ 7 ప్రకారం రూ.44,900-1,42,400 జీతం అందిస్తారు. ఇతర భత్యాలు కూడా ఇవ్వబడతాయి. దరఖాస్తు రుసుమును జనరల్, EWS, OBC అభ్యర్థులు రూ .450 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.50 చెల్లించాలి. పూర్తి వివరాలకు https://www.mha.gov.in/notifications/vacancies వెబ్సైట్ సందర్శించవచ్చు.