మూడేళ్లు, నాలుగేళ్లు చదివి గ్రాడ్యుయేషన్ పూర్తి చేయడానికి సమయం, ఆసక్తి లేని వారు షార్ట్ టర్మ్ కోర్సులు పూర్తి చేసి మంచి ఉద్యోగాలు పొందవచ్చు. ప్రస్తుత కాలంలో కొన్ని కోర్సులకు చాలా డిమాండ్ ఏర్పడింది. ఆ షార్ట్ టర్మ్ కోర్సులేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
వెబ్ డిజైనింగ్:
ఇంటర్, డిగ్రీ చేసిన వారు కూడా ఈ కోర్సు చేయవచ్చు. ఈ కోర్సు వ్యవధి 3 నుంచి 9 నెలల మధ్య ఉంటుంది. ఈ కోర్సు చేసిన వారికి వెబ్ డిజైనర్ గా ఉద్యోగావకాశాలు ఉంటాయి. మీరే సొంతంగా వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. వెబ్ డిజైనర్ కు ప్రారంభ వేతనం రూ.20 వేల నుండి రూ.25 వేల వరకు ఉంటుంది. ఆ తర్వాత శాలరీ కూడా పెరిగే అవకాశం ఉంది.
యానిమేషన్:
ఈ కోర్సు చేసిన వారికి మంచి ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. సొంత స్టార్టప్ ను కూడా ప్రారంభించవచ్చు. యానిమేటర్ కు ప్రారంభ వేతనం దాదాపు రూ.22 వేల నుండి రూ.30 వేల వరకు ఉంటుంది. ఆ తర్వాత పెరిగే అవకాశం ఉంది. సినిమాలకు కూడా పనిచేయొచ్చు.
ఫ్యాషన్ డిజైనింగ్:
చాలా ఇన్స్టిట్యూట్ లు ఫ్యాషన్ డిజైనింగ్ లో బ్యాచిలర్ డిగ్రీ , మాస్టర్స్ డిగ్రీ ప్రోగ్రామ్ లను అందిస్తున్నాయి. ఫ్యాషన్ డిజైనర్ ప్రారంభ వేతనం రూ.18 వేల వరకు ఉంటుంది. మంచి ప్రతిభ ఉంటే లక్షల్లో కూడా సంపాదించవచ్చు. సెలెబ్రిటీల కోసం కూడా పనిచేసే అవకాశం లభిస్తుంది.