ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ తమిళనాడులో రూ.7,614 కోట్ల పెట్టుబడిని ప్రకటించింది. ఓలా ఎలక్ట్రిక్ తమిళనాడు ప్రభుత్వంతో ఒక అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఎలక్ట్రిక్ కార్లను ఉత్పత్తి చేయడానికి, 20 GW సామర్థ్యంతో లిథియం-అయాన్ సెల్ తయారీ సౌకర్యాలను నిర్మించడానికి రూ.7,614 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. ఇంటిగ్రేటెడ్ 2W, కార్, లిథియం సెల్ గిగాఫ్యాక్టరీలతో ప్రపంచంలోనే అతిపెద్ద ఈవీ హబ్ ను తమిళనాడులో ఏర్పాటు చేయనున్నట్లు ఓలా ఎలక్ట్రిక్ సహ వ్యవస్థాపకుడు, సీఈవో భవిష్ అగర్వాల్ తెలిపారు.