నీట్ యూజీ పరీక్ష రాసే ప్రతి అభ్యర్థి ఉత్తమమైన, సరైన స్టడీ మెటీరియల్ ని ఎంచుకోవడం చాలా అవసరం. సరైన పుస్తకాలను ఎంపిక చేసుకోకపోవడం వల్ల చాలా కీలకమైన ప్రిపరేషన్ సమయం వృథా అవుతుంది. నీట్ పరీక్షకు సన్నద్ధమయ్యే వారికి NCERT పుస్తకాలు చదవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ఈ పుస్తకాల నుండి దాదాపు 50 నుంచి 70% ప్రశ్నలు అడుగుతారు. ఈ పుస్తకాలు అన్ని ముఖ్యమైన టాపిక్స్, థియరీ కాన్సెప్ట్స్ కవర్ చేస్తాయి.