రాష్ట్రంలో తుగ్లక్ పాలన సాగుతోందని, గన్నవరంలో వైసీపీ అరాచకాలను ప్రజలు గమనిస్తున్నారని, త్వరలో ప్రజలే తగిన బుద్ధి చెబుతారని ఉమ్మడి తూర్పు గోదావరిజిల్లా, పరిధిలోని గోపాలపురం టీడీపీ ఇన్‌చార్జి మద్దిపాటి వెంకట్రాజు అన్నారు. పార్టీ మండలాధ్యక్షుడు తాతిన సత్యనారాయణ, మాజీ ఎంపీపీ జమ్ముల సతీష్ ఆధ్వర్యంలో జరిగిన ఇదే ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో భాగంగా అనంతపల్లిలో జరిగిన కార్యక్రమంలో మద్దిపాటి మాట్లాడారు. గన్నవరంలో టీడీపీ కార్యాలయంపై, నాయకులపై వైసీపీ మూకలు దాడి చేస్తే పోలీసు శాఖ బాధితుల పక్షాన లేకుండా బాధితులను నిందితులుగా చేర్చి సెంట్రల్ జైలుకు పంపించిందన్నారు. టీడీపీ నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు సమష్టి కృషి వల్ల ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమాన్ని రాష్ట్రస్థాయిలో ప్రథమ స్థానం సాధించినట్టు పేర్కొన్నారు. కార్యక్రమంలో నియోజకవర్గ పరిశీలకుడు రాజా సూర్యబాబురాజు, షేక్ మీరా, కూచిపూడి ఉదయభాస్కరరావు, దేవరపల్లి, ద్వారకాతిరుమల మండలాల అధ్యక్షులు ఆండ్రు అనిల్, లంకా సత్యనారాయణ, యద్దనపూడి బ్రహ్మరాజు, యలమాటి శ్రీనివాసరావు, పసుమర్తి సతీష్, గన్నమని కృష్ణమోహన్, గురిమెల్లి శ్రీను తదితరులు పాల్గొన్నారు.