దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు నష్టాలలో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 126 పాయింట్ల నష్టంతో 59,284 వద్ద కొనసాగుతుండగా, నిఫ్టీ 43 పాయింట్లు నష్టపోయి 17,407 వద్ద ట్రేడవుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 82.57 దగ్గర ఉంది. బజాజ్ ఫిన్‌సర్వ్, ఎల్‌అండ్‌టీ, బజాజ్ ఫైనాన్స్, టాటా స్టీల్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, అల్ట్రాటెక్ సిమెంట్స్, రిలయన్స్ షేర్లు లాభాల్లో ఉన్నాయి.