అంతర్జాతీయ మార్కెట్ల మిశ్రమ సంకేతాల మధ్య దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు స్వల్ప లాభాలతో ప్రారంభమై కాసేపటికే నష్టాల్లోకి జారుకున్నాయి. సెన్సెక్స్ 71 పాయింట్ల నష్టంతో 58,166 వద్ద, నిఫ్టీ 28 పాయింట్ల నష్టంతో 17,125 దగ్గర కొనసాగుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 82.34 దగ్గర కొనసాగుతోంది. సెన్సెక్స్ 30 సూచీలో ఎల్అండ్టీ, భారతీ ఎయిర్టెల్, టైటన్, నెస్లే ఇండియాషేర్లు లాభాల్లో ఉన్నాయి.