ప్రపంచంలో ఆయుధాలు దిగుమతి చేసుకునే దేశాల్లో భారత్ టాప్‌ప్లేస్‌లో ఉంది. అయితే 2013-17తో పోల్చితే 2018-22లో ఈ దిగుమతులు 11% తగ్గాయి. రక్షణ కొనుగోళ్ల ప్రక్రియలో సంక్లిష్టత, స్వదేశీ డిజైన్లకు ప్రాధాన్యం వంటివి దీనికి కారణం. సిప్రీ నివేదించిన జాబితా ప్రకారం 2018-22లో ఆయుధ దిగుమతి దేశాల్లో వరుసగా భారత్, సౌదీ అరేబియా, ఖతార్, ఆస్ట్రేలియా, చైనాలు నిలిచాయి. అతిపెద్ద ఆయుధ ఎగుమతిదారుగా అమెరికా కొనసాగుతోంది.