దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నేడు లాభాలతో ట్రేడింగ్ ను ప్రారంభించాయి. సెన్సెక్స్ 414 పాయింట్ల లాభంతో 58,314 వద్ద ట్రేడవుతుండగా, నిఫ్టీ 129 పాయింట్లు లాభపడి 17,172 వద్ద ట్రేడవుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 82.14 వద్ద కొనసాగుతోంది. ఏషియన్ పెయింట్స్, టాటా స్టీల్, మారుతీ, ఐసీఐసీఐ బ్యాంక్, టాటా మోటార్స్, విప్రో, ఐటీసీ, ఇన్ఫోసిస్, రిలయన్స్, హెచ్సీఎల్ టెక్ షేర్లు లాభాల్లో ఉన్నాయి.