అంతర్జాతీయంగా బ్యాంకింగ్ రంగంలో చోటుచేసుకుంటున్న వరుస పరిణామాలు మార్కెట్లను కుదిపేస్తున్నాయి. దీంతో ఉదయం సెన్సెక్స్ 93 పాయింట్ల నష్టంతో 57,461 దగ్గర, నిఫ్టీ 35 పాయింట్లు నష్టపోయి 16,936 దగ్గర కొనసాగుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 11 పైసలు పతనమై 82.76 దగ్గర ప్రారంభమైంది. సెన్సెక్స్ 30 సూచీలో టైటన్, పవర్‌గ్రిడ్, నెస్లే ఇండియా, HDFC బ్యాంక్, సన్‌ఫార్మా షేర్లు లాభాల్లో ఉన్నాయి.