భారత్ తో జరిగిన మూడో వన్డేలో ఆస్ట్రేలియా 21 రన్స్ తేడాతో గెలిచింది. ఆస్ట్రేలియా నిర్ధేశించిన 270 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా చేధించలేకపోయింది. 49.1 ఓవర్లలో 248 రన్స్ చేసి ఆలౌటైంది. భారత బ్యాటర్లలో కోహ్లీ 54, హార్దిక్ 40 రన్స్ తో రాణించారు. ఆస్ట్రేలియా బౌలర్లలో జంపా 4, అష్టోన్ అగర్ 2, అబాట్ 1, స్టాయినిస్ 1 వికెట్ పడగొట్టారు. దీంతో ఆస్ట్రేలియా 3 మ్యాచ్ ల వన్డే సిరీస్ ను 2-1 తేడాతో గెలుచుకుంది.