అంతర్జాతీయ మార్కెట్లలోని ప్రతికూల సంకేతాలతో స్టాక్ మార్కెట్ సూచీలు నష్టాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 275 పాయింట్ల నష్టంతో 57,939 దగ్గర, నిఫ్టీ 80 పాయింట్లు నష్టపోయి 17,071 వద్ద కొనసాగుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 22 పైసలు పుంజుకొని 82.37 దగ్గర ప్రారంభమైంది. భారతీ ఎయిర్‌టెల్, సన్‌ఫార్మా, ఎల్‌అండ్‌టీ, టాటా మోటార్స్, టాటా స్టీల్, HULషేర్లు లాభాల్లో ఉన్నాయి.