దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 122 పాయింట్ల లాభంతో 57,736 దగ్గర కొనసాగుతుండగా, నిఫ్టీ 45 పాయింట్లు లాభపడి 16,996 దగ్గర ట్రేడవుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 82.24 దగ్గర కొనసాగుతోంది. ఎంఅండ్‌ఎం, హెచ్‌సీఎల్ టెక్, బజాజ్ ఫైనాన్స్, భారతీ ఎయిర్‌టెల్, హెచ్‌డీఎఫ్‌సీ, హెచ్‌యూఎల్, టాటా మోటార్స్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, మారుతీ షేర్లు లాభాల్లో ఉన్నాయి.