భారత కెప్టెన్ రోహిత్ శర్మ కీలక నిర్ణయం తీసుకున్నాడు. ఈ ఏడాదిలోనే WTC ఫైనల్, వన్డే ప్రపంచకప్ ఉన్న నేపథ్యంలో ఐపీఎల్ లో కొన్ని మ్యాచ్ లకు దూరం ఉండనున్నట్లు తెలుస్తోంది. గాయాల బెడద, వర్క్ లోడ్ నుండి తప్పించుకునేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. రోహిత్ ఆడని మ్యాచ్ లకు సూర్య కుమార్ కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు. మ్యాచ్ లు ఆడనప్పుడు డగౌట్ లో కూర్చౌని టీంను, కెప్టెన్ ను రోహిత్ గైడ్ చేయనున్నాడు.