అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల సంకేతాలతో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు శుక్రవారం భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం సెన్సెక్స్ 679 పాయింట్ల లాభంతో 58,640 దగ్గర, నిఫ్టీ 192 పాయింట్లు లాభపడి 17,273 దగ్గర కొనసాగుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 21 పైసలు పుంజుకొని 82.12 దగ్గర ప్రారంభమైంది. రిలయన్స్, టెక్ మహీంద్రా, నెస్లే ఇండియా, ICICI బ్యాంక్, HCL టెక్ షేర్లు లాభాల్లో ఉన్నాయి.