మహిళల బాక్సింగ్ ఛాంపియన్ షిప్ లో భారత బాక్సర్లు నీతు గంగాస్, స్వీటీ బూర బంగారు పథకాలు సాధించిన విషయం తెలిసిందే. వీరిద్దరూ హర్యాణాకు చెందినవారు కావడంతో హర్యాణా ప్రభుత్వం వారిని ఘనంగా సత్కరించింది. వారికి ప్రభుత్వ ఉద్యోగంతో పాటు చెరో రూ.40 లక్షలను ఇస్తామని సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ ప్రకటించారు. కాగా, నీతు గంగాస్ 48 కేజీల విభాగంలో గోల్డ్ మెడల్ సాధించగా, స్వీటీ 81 కేజీల విభాగంలో సాధించింది.