క్రమంగా పెరుగుతూ వస్తున్న బంగారం ధరలు తాజాగా జీవనకాల గరిష్ఠమైన రూ.61,000 స్థాయిని అందుకున్నాయి. ఇక్కడి బులియన్ మార్కెట్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,030 పెరిగి రూ.61,360 తాకింది. సానుకూల అంతర్జాతీయ ధోరణులు ఇందుకు కారణమని HDFC సెక్యూరిటీస్ తెలిపింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.56,250కి చేరింది. కిలో వెండి ధర సైతం ఏకంగా రూ.2,900 పెరిగి గతంలో ఎన్నడూ లేని విధంగా రూ.80,700కు చేరింది.