దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఇవాళ ఉదయం 9:29 గంటల సమయంలో సెన్సెక్స్ 760 పాయింట్ల నష్టంతో 59,670 దగ్గర ట్రేడవుతోంది. నిఫ్టీ 189 పాయింట్లు కుంగి 17,638 దగ్గర కొనసాగుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ ఐదు పైసలు పతనమై 81.90 దగ్గర ప్రారంభమైంది. సెన్సెక్స్ 30 సూచీలో పవర్‌గ్రిడ్, ఇండస్ఇండ్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ ఇతర కంపెనీల షేర్లు లాభాల్లో ఉన్నాయి.