హైదరాబాద్ జట్టు మాజీ ఓపెనర్ అబ్దుల్ అజీమ్(62) మృతిచెందారు. గత కొన్నాళ్లుగా కిడ్నీ సమస్యతో బాధపడుతున్న ఆయన నేడు తుదిశ్వాస విడిచారు. అజిమ్ 1980-95 మధ్య 73 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ లు ఆడి 4,644 పరుగులు చేశారు. ఇందులో 12 సెంచరీలు, 18 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 1986లో తమిళనాడు జట్టుపై ట్రిపుల్ సెంచరీ సైతం చేశారు. రిటైర్మెంచ్ తర్వాత హైదరాబాద్ జట్టు చీఫ్ కోచ్ గా, సెలక్టర్ గా పనిచేశారు.