ఐపీఎల్-2023లో ఫిక్సింగ్ కలకలం రేగింది. ఓ వ్యక్తి ఆర్సీబీ బౌలర్ సిరాజ్ను సంప్రదించాడు. జట్టులో అంతర్గత సమాచారం అందించాలని, అందుకు భారీగా డబ్బు ఇస్తానని వాట్సాప్ చేశాడు. దీనిని సిరాజ్ వెంటనే బీసీసీఐ అవినీతి నిరోధక విభాగం(ఏసీయూ)కు తెలిపాడు. వారు అప్రమత్తమై ఆఫర్ ఇచ్చిన వ్యక్తిని అరెస్ట్ చేశారు. విచారణలో అతడు బుకీ కాదని, బెట్టింగ్లో పెద్ద మొత్తంలో డబ్బు కోల్పోయిన ఓ డ్రైవర్ అని తేలింది.