పని భారం, కుటుంబ సమస్యలతో చాలామంది ఒత్తిడితో తీవ్ర ఇబ్బందులకు గురవుతుంటారు. దీని నుంచి బయటపడాలంటే కొన్ని చిట్కాలు పాటించాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఉదయం వేగంగా నిద్ర లేచి ముఖం కడుక్కోవాలి. సూర్యుని లేలేత కిరణాలు పడేలా చూసుకోవాలి. ఇవి హ్యాపీ హార్మోన్స్ బూస్ట్ చేస్తాయని చెబుతున్నారు. బ్రీతింగ్ వ్యాయామాలు చేస్తే మంచిది. మ్యూజిక్ వినడం, మెడిటేషన్ ఒత్తిడి నుంచి బయటపడేస్తుందంటున్నారు.