ఐపీఎల్-2023లో భాగంగా నేడు లక్నో, గుజరాత్ జట్లు మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో గుజరాత్ విజయం సాధించింది. తోలుతూ బ్యాటింగ్ చేసిన గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 135 పరుగులు చేసింది. అయితే 136 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 128 పరుగులు చేసింది.కేఎల్ రాహుల్ 68(61) పరుగులు, మేయర్స్ 24 (19), కృనాల్ 23(23) పరుగులు చేశారు. గుజరాత్ బౌలర్లలో మోహిత్ శర్మ 2, నూర్ అహ్మద్ 2, రషీద్ ఒక వికెట్ తీశారు.