బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. మంగళవారం ఉదయం వరకు నమోదైన ధరల ప్రకారం.. దేశంలో 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర రూ.70 తగ్గి రూ.55,650 లు ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 80 తగ్గి రూ.60,710 గా ఉంది. ఏపీ, తెలంగాణలలో ధరలు ఈ విధంగానే ఉన్నాయి. కాగా ప్రస్తుతం ఢిల్లీ, ముంబైలో కిలో వెండి ధర రూ.500 తగ్గి రూ.76,400 లుగా కొనసాగుతోంది. అయితే హైదరాబాద్, ఏపీలో కిలో వెండి ధర రూ.80,000 ఉంది.