నేడు ఐపీఎల్ లో భాగంగా రాజస్థాన్ రాయల్స్ , ముంబై ఇండియన్స్ జట్లు మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో ముంబై విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ కు దిగిన రాజస్తాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 212 పరుగులు చేసింది. అయితే 213 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 214 పరుగులు చేసి విజయం సాధించింది. ఉత్కంఠగా సాగిన మ్యాచ్లో ముంబైకి చివరి ఓవర్లో 17 పరుగులు కావాలి. జేసన్ హోల్డర్ బౌలింగ్లో టిమ్ డేవిడ్ తొలి 3 బంతుల్లో 3 సిక్సర్లు బాది జట్టుకు విజయాన్ని అందించాడు.యశస్వి జైస్వాల్ కెరీర్లో తొలి సెంచరీ సాధించాడు. 62 బంతుల్లో 124 పరుగులు చేసి ఇన్నింగ్స్ ఆడాడు. ముంబై ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ 29 బంతుల్లో 55 పరుగులు చేశాడు.