బెంగాల్‌లోని బంకురా జిల్లాలో ఆదివారం సాయంత్రం తృణమూల్ కాంగ్రెస్ (టిఎంసి) నిర్వహించిన బహిరంగ సభ సందర్భంగా పిడుగుపాటుకు ఒకరు మృతి చెందగా, దాదాపు 50 మంది గాయపడ్డారు.టిఎంసి యువనేత దేబాంగ్సు భట్టాచార్య బహిరంగ సభలో ప్రసంగించనున్న ఇండాస్ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. సమేద్ మల్లిక్ (36) అనే వ్యక్తి ప్రాణాలు కోల్పోగా, పలువురు గాయపడ్డారు. ఏడుగురు క్రిటికల్ పేషెంట్లను మెరుగైన చికిత్స కోసం బుర్ద్వాన్ మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa