నేటి నుండి ఆసియా వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్ షిప్ ప్రారంభంకానుంది. దక్షిణ కొరియాలోని జింజు నగరంలో ఈ పోటీలు జరగనున్నాయి. ఈ పోటీల్లో మెరుగైన ప్రదర్శన చేసినవారు ఒలంపిక్స్ కు అర్హత సాధిస్తారు. భారత్ నుండి మీరాబాయ్ చాను, జెరెమీ లాల్రినుంగా, అచింత షూలీ, బింద్రారాణి, శుభమ్, నారాయణ అజిత్ బరిలోకి దిగుతున్నారు. అయితే మీరాబాయ్ చాను వెన్నునొప్పి కారణంగా ఈ పోటీల్లో నామమాత్రంగా పాల్గొంటున్నారని ఆమె కోచ్ తెలిపారు.