కొంతమందికి పాదాల నుంచి దుర్వాసన వస్తుంది. రోజూ షూస్ ధరించడంతో ఆ బ్యాక్టీరియా పాదాలకు అంటుకోవడం, చెమట వల్ల కూడా ఈ సమస్య రావొచ్చు. అలాంటి వారు ఓ పాత్రలోని నీటిలో 2 టీ బ్యాగ్స్ వేసి మరిగించాలి. తర్వాత బ్యాగ్స్ తీసేసి గోరువెచ్చని నీటిలో పాదాలను 15 నిమిషాలు ఉంచాలి. రాత్రి నిద్రపోయే ముందు లావెండర్ ఆయిల్ పాదాలపై వేసి మర్దనా చేస్తే దుర్వాసన రాదు. కొబ్బరి నూనెతో పాదాలు మర్దనా చేసినా ఉపశమనం కలుగుతుంది.