మేషం: వ్యయప్రయాసలతో కొన్ని పనులు పూర్తి అవుతాయి. ధనవ్యయ సూచనలు ఉన్నవి. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఉద్యోగాలలో చికాకులు మరింత పెరుగుతాయి. అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ప్రయాణాలు చివరి నిమిషంలో వాయిదా పడతాయి.
వృషభం: నూతన వస్తులాభాలు ఉంటాయి. ఆకస్మిక ధనలబ్ధి కలుగుతుంది. దూరపు బంధువుల నుండి విలువైన సమాచారం అందుతుంది. వృత్తి ఉద్యోగాలలో మీ పనితీరు అందరినీ ఆకట్టుకుంటారు. ఇంటా బయట ఆశ్చర్యకర సంఘటనలు చోటుచేసుకుంటాయి. వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి.
మిధునం: విద్యార్థుల అంచనాలు అందుకుంటారు. సమాజంలో పరపతి పెరుగుతుంది. ముఖ్యమైన వ్యవహారాలలో సన్నిహితులు, సహాయ సహకారాలు అందుతాయి. నూతన వాహనయోగం ఉన్నది. దైవదర్శనాలు చేసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలు సజావుగా సాగుతాయి.
కర్కాటకం: వ్యాపార వ్యవహారాలలో తొందరపాటు నిర్ణయాలు చేసి నష్టాలు ఎదుర్కొంటారు. బంధువులతో మాటపట్టింపులు కలుగుతాయి. చేపట్టిన పనులలో శ్రమ తప్పదు. గృహమున కొందరి ప్రవర్తన శిరో బాధ కలిగిస్తుంది ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి. వ్యాపారాలు, ఉద్యోగాలు నత్తనడకన సాగుతాయి.
సింహం: ఎంత శ్రమపడిన పనులు ముందుకు సాగవు. ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. ముఖ్యమైన పనులలో వ్యయప్రయాసలు అధికమవుతాయి. మానసిక సమస్యలు బాధిస్తాయి. మిత్రులతో చిన్నపాటి విభేదాలు ఉంటాయి. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగాలలో అధికారుల నుంచి ఒత్తిడి అధికమవుతుంది.
కన్య: నూతన వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. దూరపు బంధువుల నుండి శుభవార్తలు అందుకుంటారు. వ్యాపార వ్యవహారాలలో ఆకస్మికంగా నిర్ణయాలు మార్చుకుంటారు. స్థిరాస్తి క్రయ విక్రయాలలో నూతన లాభాలు అందుకుంటారు. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగమున మీ విలువ మరింత పెరుగుతుంది.
తుల: ఆరోగ్యం మందగిస్తుంది. ధన పరమైన చికాకులు పెరుగుతాయి. గృహ వాతావరణం చికాకుగా ఉంటుంది. మిత్రులతో ఊహించని మాటపట్టింపులు కలుగుతాయి. ముఖ్యమైన వ్యవహారాలలో ఆటంకాలు కలుగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు నిదానంగా సాగుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.
వృశ్చికం: నూతన వాహనం కొనుగోలు చేస్తారు. నిరుద్యోగుల చిరకాల స్వప్నం నెరవేరుతుంది. చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. ఆప్తుల నుంచి శుభవార్తలు అందుతాయి. వ్యాపారాలు అభివృద్ధి బాటలో పయనిస్తాయి. ఉద్యోగాలలో అధికారులతో చర్చలు సఫలం అవుతాయి.
ధనస్సు: ఇంటా బయట శ్రమాధిక్యత పెరుగుతుంది. దూరప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. మిత్రుల నుంచి ఋణ ఒత్తిడులు పెరుగుతాయి. చేపట్టిన వ్యవహారాలలో అవరోధాలు తప్పవు. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వ్యాపారాల విస్తరణ ప్రయత్నాలు మందగిస్తాయి. ఉద్యోగాలలో ఒడిదుడుకులు పెరుగుతాయి.
మకరం: చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. దైవ సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. నిరుద్యోగులకు నూతన అవకాశములు అందుతాయి. దైవచింతన పెరుగుతుంది ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో ఉన్నతి కలుగుతుంది.
కుంభం: చేపట్టిన వ్యవహారాలలో పురోగతి సాధిస్తారు. విలువైన వస్త్ర ఆభరణలు కొనుగోలు చేస్తారు. చిన్ననాటి మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు. వాహన అనుకూలత కలుగుతుంది. అధికారులతో చర్చలు సఫలం అవుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు మరింత అనుకూలంగా సాగుతాయి.
మీనం: ఆర్థిక ఇబ్బందులు అధికమౌతాయి. ఇంటా బయట పరిస్థితులు అనుకూలించవు. ముఖ్యమైన వ్యవహారాలు ముందుకు సాగక నిరాశ కలిగిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో శ్రమ తప్పదు. ఆరోగ్య విషయంలో కొంత శ్రద్ద వహించాలి. వ్యాపారాలలో నూతన పెట్టుబడులు పెట్టకపోవడం మంచిది.