చిలమత్తూరు మండలంలోని కొడికొండ కొండపై వెలసిన సప్తమాతృక అమ్మవార్ల రథోత్సవం శనివారం ఆ గ్రామ ప్రజలు అత్యంత వైభవంగా నిర్వహించారు. ముందుగా కొండపై వెలసిన ఆలయంలో అమ్మవార్లకు భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గ్రామంలో ఉన్న అమ్మవార్ల విగ్రహాలకు అభిషేకాలు, అర్చనలు, హోమాలు నిర్వహించారు. అనంతరం ప్రత్యేకంగా సిద్దం చేసిన రథంపై అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలను రథంలో ఉంచి గ్రామ వీధుల గుండా మంగళ వాయిద్యాలతో ఊరేగింపు చేశారు. ఈ కార్యక్రమంలో యువకులు పోటీ పడి ఉట్టి మాను ఎక్కి ఉట్టి కొట్టారు. ఈ ఉత్సవాన్ని వీక్షించడానికి ప్రజ పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.