దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 99 పాయింట్ల లాభంతో 61,863 దగ్గర, నిఫ్టీ 30 పాయింట్లు లాభపడి 18,295 దగ్గర కొనసాగుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 8 పైసలు పుంజుకొని 81.86 దగ్గర ప్రారంభమైంది. బజాజ్ ఫిన్సర్వ్, టైటన్, ఎల్అండ్టీ, ఇండస్ఇండ్ బ్యాంక్, టాటా స్టీల్, టాటా మోటార్స్, పవర్‌గ్రిడ్, యాక్సిస్, NTPC షేర్లు లాభాల్లో ఉన్నాయి.