జాతకంలో శనీశ్వరుడు 1, 4, 7, 10 రాశుల్లో ఉంటే ఎక్కడ లేని బద్దకం ఆవరిస్తుందని పండితులు పేర్కొంటున్నారు. దీని నుంచి బయటపడితే అదృష్ట యోగం పట్టడం ఖాయమని చెబుతున్నారు. వృషభ రాశి వారు మంచి ఉద్యోగంలోకి మారడానికి గట్టి ప్రయత్నం చేయాలి. సింహ రాశి వారు సోమరితనం కారణంగా ఆదాయావకాశాలు కోల్పోయే అవకాశం ఉంది. వృశ్చిక రాశి వారికి అప్రమత్తతతో కెరీర్, ఆర్థిక వృద్ధి కలుగుతుంది. కుంభ రాశి వారికి అనుకూల సమయమని అంటున్నారు.