మైక్రోసాఫ్ట్‌కు చెందిన ఎంప్లాయిమెంట్ సోషల్ నెట్వర్క్ లింక్డ్ఇన్ తన ఉద్యోగులకు షాక్ ఇచ్చింది. తాజాగా కంపెనీలో పనిచేసే కొంతమంది ఉద్యోగులను తొలగించనున్నట్లు ప్రకటించింది. సుమారు 716 మందికి లేఆఫ్ ప్రకటించినట్లు వెల్లడించింది. కంపెనీ కార్యకలాపాలను క్రమబద్దీకరించడమే లక్ష్యంగా అమ్మకాలు, కార్యకలాపాలు, సహాయ బృందాల్లో స్టాఫ్‌ను తగ్గించాలని భావిస్తున్నట్లు సీఈవో ర్యాన్ రోస్లాన్స్కీ పేర్కొన్నారు.