ఏ వ్యాధినైనా ఎదుర్కొనేందుకు రోగ నిరోధక శక్తి ముఖ్యం. కొన్ని లక్షణాలతో ఇమ్యూనిటీ పవర్ లోపాన్ని గుర్తించొచ్చని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. ఎక్కువగా ఉదర సబంధిత సమస్యలు కలుగుతాయి. తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం అవ్వదు. పింపుల్స్, కురుపులు తగ్గడానికి ఎక్కువ సమయం పడుతుంది. తరచూ జలుబు, దగ్గు, జ్వరం, బలహీనత వంటి సమస్యలు ఎదుర్కొంటే రోగ నిరోధక శక్తి తక్కువగా ఉందని భావించి తగు జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు.