ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రేపు ఆ జిల్లాలో పవన్ కల్యాణ్ పర్యటన

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, May 09, 2023, 03:30 PM

జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ బుధవారం ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. ఈ మేరకు అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ఆయన పరామర్శించనున్నారు. మొదట రాజమండ్రి చేరుకొని ఆ తర్వాత ఉమ్మడి గోదావరి జిల్లా పరిధిలో దెబ్బతిన్న పంటలను పరిశీలించనున్నారు. అనంతరం వారితో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకోనున్నారు. ఈ పర్యటనలో జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్, ఆ పార్టీ రాష్ట్ర, జిల్లా నేతలు పాల్గొంటారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa