ఇంగ్లండ్ క్రికెటర్ సామ్ బిల్లింగ్స్ క్యాన్సర్ బారిన పడ్డాడు. స్క్రీనింగ్ టెస్టులో చర్మ క్యాన్సర్ అని తేలడంతో చికిత్స తీసుకున్నానని, ప్రమాదం తప్పిందని తెలిపాడు. ఛాతిలో క్యాన్సర్ కణితిని వైద్యులు గుర్తించి ఆపరేషన్ చేసి తొలగించారని, క్రమంగా కోలుకుంటున్నానని వెల్లడించాడు. కాగా, బిల్లింగ్స్ ఇంగ్లాండ్ తరపున 3 టెస్టులు, 28 వన్డేలు, 37 టీ20లు ఆడాడు.