ఐపీఎల్లో భాగంగా బుధవారం జరిగిన మ్యాచ్లో ఢిల్లీపై చెన్నై ఘన విజయం సాధించింది. 27 పరుగుల తేడాతో గెలిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ 167/8 స్కోరు చేసింది. ఛేదనలో ఢిల్లీ బ్యాటింగ్ లైనప్ కుప్పకూలింది. 20 ఓవర్లలో 140/8 స్కోరు చేసి ఓటమి పాలైంది. ఢిల్లీ బ్యాటర్లలో రోసో (35), మనీష్ పాండే (27) మాత్రమే చెప్పుకోదగ్గ స్కోరు చేశారు. చెన్నై బౌలర్లలో పతిరానా 3, దీపక్ చాహర్ 2, జడేజా ఒక వికెట్ చొప్పున తీశారు.