దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నేడు స్వల్ప లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 62 పాయింట్లు లాభపడి 62,202 దగ్గర కొనసాగుతోంది. నిఫ్టీ 12 పాయింట్ల లాభంతో 18,327 వద్ద ట్రేడవుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 82.96 దగ్గర ట్రేడవుతోంది. టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, హెచ్డీఎఫ్సీ, టీసీఎస్, అల్ట్రాటెక్ సిమెంట్స్, బజాజ్ ఫిన్సర్వ్, విప్రో, ఎన్టీపీసీ, హెచ్సీఎల్ టెక్ షేర్లు లాభాల్లో ఉన్నాయి.