నువ్వులలోని పోషకాలు, యాంటీ ఆక్సిడెంట్లతో అనేక ఆరోగ్య ప్రయోజనాలని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. నువ్వులను క్రమంగా తింటే ఎముకలకు మంచి ఆరోగ్యం ఇస్తాయని, చెడు కొలెస్ట్రాల్ తగ్గించడంలో సహాయ పడుతుందంటున్నారు. గుండెజబ్బుల ప్రమాదాన్ని నివారిస్తుంది. బీపీ, రక్తంలో చక్కెర స్థాయి నువ్వులతో తగ్గుతుందంటున్నారు. నువ్వుల నూనెతో చర్మ సమస్యలు తగ్గించవచ్చంటున్నారు.